వరంగల్‍ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్

వరంగల్‍ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..డోంట్ మిస్

మాజీ సర్పంచ్​ భర్త వేధిస్తున్నాడు 

నర్సింహులపేట, వెలుగు : మాజీ సర్పంచ్ భర్త బూతులు తిడుతూ వేధిస్తున్నాడని కార్యదర్శి సుధాకర్ ఆరోపిస్తూ మంగళవారం ఎంపీడీవో ఆఫీసులో ప్లకార్డులతో నిరసన తెలిపాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గోల్ బోడ్క తండా మాజీ సర్పంచ్ భర్త కిషన్ పంచాయతీ నుంచి అడ్వాన్సుగా రూ. 2.20 లక్షలు తీసుకున్నట్టు సుధాకర్​తెలిపాడు.

సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆమె భర్త చేసిన అభివృద్ధి పనుల డబ్బులు జీపీలో జయ అయ్యాయని ఇవ్వాలని బెదిరించాడని చెప్పాడు. రికార్డులు ఇవ్వాలని కోరడంతో బెదిరింపులకు పాల్పడ్డాడని, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని కోరాడు. అనంతరం పీఎస్​లో ఫిర్యాదు చేశాడు.